వికలాంగులకు ప్రభుత్వం అండ

జగనన్న ప్రభుత్వంలో వికలాంగులను సంక్షేమం దిశగా కృషి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు. ఆదివారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆవులు వేణుగోపాలరావు వికలాంగుల ప్రపంచ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులకు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తున్న పెన్షన్‌ రూ.3వేలకు జగన్‌

మాట్లాడుతున్న కృపారాణి

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌

జగనన్న ప్రభుత్వంలో వికలాంగులను సంక్షేమం దిశగా కృషి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు. ఆదివారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆవులు వేణుగోపాలరావు వికలాంగుల ప్రపంచ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులకు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తున్న పెన్షన్‌ రూ.3వేలకు జగన్‌ పెంచారన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కొల్లి ఎల్లయ్య మాట్లాడుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి చట్టంలో పొందుపర్చిన చట్టాలు తూచా తప్పకుండా భారతదేశంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు పెన్షన్‌ హామీ ఇచ్చారని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న వికలాంగులను పర్మనెంట్‌ చేయాలన్నారు. డిగ్రీ చదువుకున్న అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం వికలాంగులకు పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి వాకాడ శ్రీధర్‌ రెడ్డి, వికలాంగులు పాల్గొన్నారు.పలాస: వికలాంగులకు ప్రభుత్వం అండగా ఉందని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంఘాలుగా ఏర్పాటుచేసి వారి అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తుందని మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఆదివారం మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల మాదిరిగా కొంతమంది విభిన్న ప్రతిభవంతులను సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమాజంలో అంగవైకల్యాన్ని అధికమించే విధంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌, కౌన్సిలర్లు సనపాల సింహాచలం, పప్పల ప్రసాద్‌, బల్ల రేవతి శ్రీనివాస్‌, దున్న సత్యం, మెప్మా అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️