వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి

విద్యార్థులు చదువకుంటున్నప్పుడే సాఫ్ట్‌స్కిల్స్‌పై అవగాహన పెంచుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు అన్నారు. కళాశాలలో స్కిల్‌ ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. విద్యార్థులు వారి విద్యార్థి దశను

మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ సూర్యచంద్రరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

విద్యార్థులు చదువకుంటున్నప్పుడే సాఫ్ట్‌స్కిల్స్‌పై అవగాహన పెంచుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు అన్నారు. కళాశాలలో స్కిల్‌ ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. విద్యార్థులు వారి విద్యార్థి దశను విజయవంతంగా అధిగమిస్తే భవిష్యత్‌లో ఏ రంగంలోనైనా రాణించగలరన్నారు. వారం రోజులుగా ప్రభుత్వ మహిళా కళాశాల జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ విభాగం సంయుక్తంగా స్టూడెంట్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ సహకారంతో సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంప్లాయిబిలిటీ స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఉమెన్‌ను నాంది ఫౌండేషన్‌, మహేంద్ర ప్రైడ్‌ క్లాస్‌ ప్రోగ్రాం ట్రైనర్స్‌, ఎ.గీత, వై.హరికుమార్‌, ఎన్‌.జీవన్‌ కుమార్‌ 167 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జి.సుమలత, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శంకర్‌నారాయణ, ఐక్యుఎసి కోఆర్డినేటర్‌ ఎస్‌-పద్మావతి, అకాడమిక్‌ కో-ఆర్డినేటర్‌ సిహెచ్‌.కృష్ణారావు, జెకెసి కో-ఆర్డినేటర్‌ ఐ.లక్ష్మి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కో-ఆర్డినేటర్‌ ఎస్‌.వాణీకుమారి, ఎస్‌.మాధవి పాల్గొన్నారు.

 

➡️