వ్యవసాయ యాంత్రీకరణతో అధిక దిగుబడి

వ్యవసాయ యాంత్రీకరణతో అధిక

శాస్త్రీయ సలహా మండలి సమావేశం నిర్వహిస్తున్న కెవికె ప్రతినిధులు

ప్రజాశక్తి- ఆమదాలవలస

వ్యవసాయ యాంత్రీకరణతో అధిక దిగుబడిని సాధించవచ్చని అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్‌ పి.వి.కె జగన్నాథరావు అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో 42వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరకు రకాలపై పరిశోధనా క్షేత్రాలు, నాణ్యమైన బెల్లం తయారీపై పలురకాల కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కె.వి.కె కో-ఆర్డినేటర్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2023-24లో శాస్త్రవేత్తలు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ 2024-25లో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఆంగ్రు గుంటూరు విస్తరణ సంచాలకుల ప్రతినిధి డాక్టర్‌ బి.ముకుందరావు కృషి విజ్ఞాన కేంద్రం చేపట్టే కార్యక్రమాలను అభినందించారు. వ్యవసాయ యాంత్రీకరణలో, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, సిబ్బంది చేస్తున్న కృషిని కొనియాడారు. జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీధర్‌ మాట్లాడుతూ జిల్లాలో అపరాల సాగు, సమగ్ర యాజమాన్య పద్ధతులపై పలురకాల కార్యక్రమాలను చేపట్టాలని, కార్యక్రమ ప్రణాళికలో భాగంగా ప్రదర్శనా క్షేత్రాలను, పరిశీలన క్షేత్రాలను పొందుపర్చాలని శాస్త్రవేత్తలకు విన్నవించారు. ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్‌ బావ మాట్లాడుతూ జీడిమామిడి, ఇతర ఉద్యానవన పంటల్లో సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులపై తెలిపారు. కార్యక్రమంలో అంగ్రు గుంటూరు వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి పి.వి సత్యనారాయణ, ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి భగవాన్‌, యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి బి.అప్పలస్వామి, ఆత్మా పీడీ డాక్టర్‌ రామచంద్రరావు, అనుబంధ రంగాల అధిపతులు, శాస్త్రీయ సలహా మండలి రైతు సభ్యులు, ఎన్‌జిఒలు పాల్గొన్నారు.

➡️