‘శంఖారావం’ను విజయవంతం చేయాలి

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిఎం కావడం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని

లావేరు : మాట్లాడుతున్న కళావెంకటరావు

ప్రజాశక్తి- లావేరు

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిఎం కావడం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని మాజీమంత్రి, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు అన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం కార్యక్రమం ఈ నెల 15న లావేరులో నిర్వహించ నుండటంతో ఆదివారం సభాస్థలిని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి లోకేష్‌ యువగళం పాదయాత్ర చేపట్టారని, ఆ యాత్ర సాగనివ్వకుండా వైసిపి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా లోకేష్‌ వెనుకడుగు వెయ్యకుండా యాత్రను విజయవంతం చేశారన్నారు. అనంతరం బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి టిడిపి ఎన్నికలు మేనిఫెస్టోలో సూపర్‌ సిక్స్‌ పథకాలను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఎచ్చెర్ల ఎఎంసి చైర్మన్‌ యినపకుర్తి తోటయ్యదొర, రణస్థలం మాజీ ఎంపిపి గొర్లె విజ యనాయుడు, లంక శ్యామ్‌, పిన్నింటి భానోజీరావు, వెంకటరమణ, గంట్యాడ మహేష్‌ పాల్గొన్నారు. పాతపట్నం : నారా లోకేష్‌ ఈ నెల 13న పాతపట్నంలో నిర్వహించనున్న శంఖారావంను విజయవంతం చేయాలని టిడిపి నాయకులు, పా రిశ్రామిక వేత్త మామిడి గోవిందరావు కార్యకర్తల ను కోరారు. ఈయనతో పాటు ఐదు మండలాల నాయకులు, ఎంజిఆర్‌ శ్రేణులు ఉన్నారు. ఆమదాలవలస: నేడు పట్టణంలో జూనియర్‌ కళాశాల మైదానంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం సభ సాయంత్రం 4 గంటలకు జరగనుందని జన సైనికులు ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావు ఒక ప్రకటనలో కోరారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన జనసేన మండల నాయకులు, కార్యవర్గ సభ్యులు వీర మహిళలు ఈ సభలో పాల్గొని మద్దతు తెలియజేయాలని కోరారు.

 

➡️