శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు మూఢనమ్మకాలను అనుసరించకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దనరావు అన్నారు. గురువారం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్టు విద్యార్థులకు

కోటబొమ్మాళి : ప్రశంసాపత్రాలతో విద్యార్థులు

పజాశక్తి- ఆమదాలవలస

విద్యార్థులు మూఢనమ్మకాలను అనుసరించకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దనరావు అన్నారు. గురువారం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్టు విద్యార్థులకు నిర్వహించారు. ఈ పరీక్షలను స్థానిక జనవిజ్ఞాన వేదిక నాయకులు బొడ్డేపల్లి ప్రకాశరావు, టివిటి భాస్కరరావు, ఎం.శ్యామలరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెవివి సీనియర్‌ నాయకులు మోహనరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ పోటీల్లో మండలస్థాయిలో ప్రథమ బహుమతి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ తొగరాం విద్యార్థులు ఎం.సురేష్‌, కె.చరణ్‌ తేజ, జి.దుర్గాప్రసాదరావులు కైవసం చేసుకున్నారు. ద్వితీయ బహుమతిని కొర్లకోట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు డి.యశస్వి, కె.జస్వంత్‌, జి.అనుషలు కైవసం చేసుకున్నారు. పట్టణస్థాయి ప్రధమ బహుమతి మున్సిపల్‌ హైస్కూల్‌ లక్ష్మీ నగర్‌ విద్యార్థులు పి.తరుణ్‌, ఎం.భావన, జి.జ్యోతిక కైవసం చేసుకున్నారు. ద్వితీయ బహుమతిని మున్సిపల్‌ హైస్కూల్‌ లక్ష్మీనగర్‌ బిటీం ఎం.ఝాన్సీ, వై.హరి చరణ్‌, ఎస్‌.వైవిద్య కైవసం చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎంపిడిఒ ఎస్‌.వాసుదేవ రావు చేతులమీదుగా బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గెడ్డాపు రాజేంద్రప్రసాద్‌, జనవిజ్ఞాన వేదిక నాయకు లు హెచ్‌వి సత్యనారాయణ, కె. షణ్ముఖరావు, కె.జనార్దనరావు, బి.గోవిందరావు, సూర్యనారాయ ణ, బగాన రమణ, టి.ఉమామహేశ్వరరావు, బి.సురేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.పొందూరు: జిల్లాస్థాయిలో జనవరి 7న జరిగే సైన్స్‌ టాలెంట్‌ పోటీలకు మండలంలోని కింతలి, లోలుగు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్ధులు ఎంపికైనట్లు చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ పోటీల మండల కన్వీనర్‌ వి.రమణరావు తెలిపారు. గురువారం స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్‌ ఆచారి అధ్యక్షతన మండలస్థాయి చెకుముకి సైన్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 11 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. విజేతలకు స్ధానిక ఎంఇఒ-2 పట్నాన రాజారావు చేతులు మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.చెకుముకి పోటీల విజేత ‘నలంద’కోటబొమ్మాళి: స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డబ్బీరు గోవిందరావు ఆధ్వర్యాన గురువారం చెకిముకి పోటీలు నిర్వహించారు. మండలంలోని 11 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అందులో స్థానిక నలందా స్కూల్‌కు ప్రథమ స్థానం, లఖందిడ్డి జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలకు ద్వితీయ స్థానం సాధించారు. జివివి జిల్లా కార్యదర్శి సామ సంజీవరావు, ఎఎస్‌ ఉపాధ్యాయులు కె.ఆర్‌.కె.రెడ్డిల నాయకత్వంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్ధులకు ధ్రువపత్రాలు, సైన్సు (జనవిజ్ఞాన వేదిక) పుస్తకాలను పంపిణీ చేశారు. వీరు జనవరి 7న శ్రీకాకుళంలో జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో నిర్వహించనున్న జిల్లా చెకిముకి పోటీలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సైన్స్‌ ఉపాధ్యాయులు కె.శ్రీనివాసరావు, ఎస్‌.గోవిందరావు, ఆరుణకుమారి, ఆనందరావు, సంధ్యారాణి, కరజాన బాస్కరరావు పాల్గొన్నారు.

 

➡️