సచివాలయ వ్యవస్థతో అభివృద్ధి

గ్రామాలు అభివృద్ధి చెందాలని, ప్రజలకు గ్రామాల్లోనే అక్కడక్కడే సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అప్పలరాజు

పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

గ్రామాలు అభివృద్ధి చెందాలని, ప్రజలకు గ్రామాల్లోనే అక్కడక్కడే సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలో తలమానికంగా నిలిచాయని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని అమలకుడియాలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్‌ ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. వీటిని ప్రతి పక్షాలు జగన్‌ రాష్ట్రాన్ని నాశినం చేస్తున్నారని అంటున్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించాలన్నారు. వైసిపి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొర్ల శిరీష, కొర్ల మురళీకృష్ణచౌదరి, ఎంపిపి ఉంగ ప్రవీణ, పలాస పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి, పలాస ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, గొండు మోహనరావు, దంతం వైకుంఠరావు పాల్గొన్నారు.

 

➡️