సామాజిక భద్రతకు భరోసా

ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కింద సంక్షేమ పథకాలను

బూర్జ : పింఛను పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- బూర్జ

ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కింద సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని, ఈ క్రమంలోనే పింఛను మొత్తాన్ని రూ.3000కు పెంచడం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండలం కొల్లివలసలో రెసిడెన్షియల్‌ పాఠశాల ఆవరణలో మండలానికి చెందిన లబ్ధిదారులకు పింఛను కానుకను గురువారం అందజేశారు. వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, డప్పు కళాకారులకు ఇలా 17 కేటగిరీలకు పింఛను అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌, ఎంపిపి కర్నేన దీప, మండల పార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ జల్లు బలరాంనాయుడు పాల్గొన్నారు. మెళియాపుట్టి: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో పెంచిన పింఛన్‌ కానుకను ఎమ్మెల్యే రెడ్డి శాంతి అందజేశారు. అనంతరం సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.చంద్రకుమారి, తహశీల్దార్‌ పి.సరోజిని, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఉర్లానా బాలరాజు, వైసిపి మండల కన్వీనర్‌ పల్లి యోగి, ట్రై కార్‌ డైరెక్టర్‌ సవర సుభాష్‌, ఎపిఎం లలిత పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌ : స్థానిక పంచాయతీ కార్యాలయంలో పింఛను కానుకను టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ వాణి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి అట్లా సరోజనమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు సత్తారు సత్యం, సర్పంచ్‌ గొండెలి సుజాత, ఎంపిటిసిలు కూన పార్వతి, పీత హేమలత, మండల సచివాలయం కన్వీనర్లు శిగిలిపల్లి మోహనరావు పాల్గొన్నారు. కోటబొమ్మాళి: ఎంపిడిఒ కార్యాలయంలో పింఛను కానుకను టెక్కలి వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కుప్పిలి ఫణీంద్రకుమార్‌, వైస్‌ ఎంపిపి బోయిన నాగేశ్వరరావు, దుక్క రోజా, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాడాన మురళి, మండల పార్టీ అద్యక్షుడు నూక సత్యరాజు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : మండల పరిషత్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి పింఛను కానుకను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ దుక్క లోకేశ్వరరెడ్డి, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పడ నారాయణమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పాతిర్ల రాజశేఖర్‌, మండల జెసిఎస్‌ అధ్యక్షులు ఆశి పురుషోత్తం, సల్ల దేవరాజ్‌, కారంగి మోహనరావు, ఉప్పాడ రాజారెడ్డి పాల్గొన్నారు. పలాస : పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి గాంధీ నగర్‌, సచివాలయం తిలక్‌ నగర్‌, చినబడాం, అంతరకూడ్డ పెసరపాడులో మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు పించను కానుకను పంపిణీ చేశారు. ముందుగా సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌, కౌన్సిలర్లు సనపల సింహాచలం, కౌన్సిలర్‌ ప్రతినిధి బల్ల శ్రీను, దువ్వాడ రమణ పాల్గొన్నారు.రణస్థలం రూరల్‌: మండలంలో వల్లభరావుపేటలో నూతన పింఛన్ల పెంపును వైసిపి జిల్లా మహిళా విభాగం జనరల్‌ సెక్రెటరీ గురాన తిరుమల మానస పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్‌ మహంతి సత్యనారాయణ, గడి సత్యం, గురాన చిరంజీవి, గడి రమణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

 

➡️