స్త్రీశక్తి భవనానికి మోక్షమెప్పుడో?

మహిళా సాధికారితే తమ లక్ష్యమని, మహిళా అభ్యుదయానికి, మహిళలు ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో

పిచ్చిమొక్కలతో నిండిపోయిన పునాదులు

అశిలాఫలకాలకే పరిమితం

మహిళా సంఘాల సమావేశాలకు ఇబ్బందులు

పాలకులు, అధికారులకు పట్టని మహిళల అవస్థలు

ప్రజాశక్తి- పొందూరు

మహిళా సాధికారితే తమ లక్ష్యమని, మహిళా అభ్యుదయానికి, మహిళలు ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటు అందిస్తుందంటూ పాలకులు సమావేశాల్లో పదేపదే చెప్పడం పరిపాటి. మహిళా సాధికారత, ఆర్ధిక పరిపుష్టిని సాధించేందుకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల నిర్వాహణ, కార్యకలాపాలు, సమావేశాల నిర్వాహణకు అనువైన కార్యాలయం లేదు. దశాబ్ధాలు గడుస్తున్నా పొందూరు వెలుగు కార్యాలయానికి శాశ్విత భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 2011 నుంచి వెలుగు కార్యాలయానికి శాశ్విత భవనం నిర్మాణం జరిపేందుకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు వేస్తున్నారే తప్ప భవన నిర్మాణం మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. దీంతో మహిళలు సమావేశాలు ఏర్పాటుకు, సంఘాల నిర్వాహణకు నానా అవస్థలు పడుతున్నారు. దర్శనమిస్తున్న శిలాఫలకాలుఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో వెలుగు కార్యాలయ భవన నిర్మాణం చేసేందుకు 2011లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అనంతరం 2019లో రూ.40లక్షలతో భవన నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రభుత్వ విప్‌, శాసనసభ్యులు కూన రవికుమార్‌ శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి పునాదులు వేసి వదిలివేశారు. దీంతో ఇరువురు వేసిన శిలాఫలకాలే మిగిలాయి తప్ప భవనం నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. సమావేశాలకు అవస్థలు…మండలంలో 1739 మహిళా పొదుపు సంఘాలు ఉండగా, ఇందులో సుమారు 22వేల మంది సభ్యులున్నారు. అలాగే 46 మంది విఒఎలు, నలుగురు సిసిలు, ఎపిఎంలు ఉన్నారు. మహిళా సాధికారత కోసం విరివిగా వివిధ రూపాల్లో రుణాలను ప్రభుత్వాలు మహిళలకు అందజేస్తున్నాయి. ఈ రుణాలను సద్వినియోగపర్చు కునేందు కు మహిళలకు అవగాహన సమావేశాలను నిర్వహిస్తుంటాయి. ఈ సమావేశాలు నిర్వా హణకు అనువైన భవనం లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తుందంటూ పేర్కొంటున్నారు. ఇరుకైన గదిలోనే ఇబ్బం దులు పడుతూ కూర్చోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ అవస రాల కోసం వచ్చే మహిళలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు అనువుగా మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోతున్నారు. తమ సమస్యలు పాలకులు, అధికారులకు పట్టడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లావెలుగు కార్యాలయానికి శాశ్విత భవనం నిర్మాణానికి సంబంధించి పునాదు లు వేసి వదిలివేశారు. కార్యక లాపాలు నిర్వాహణకు అనువుగా లేకపోవడంతో ఇరుకైన గదిలోనే సమావేశాలు, రికార్డుల నిర్వాహణ చేయాల్సి వస్తుంది. ఈ సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసు కువెళ్లాం. – జి.శ్యామలరావు, ఎపిఎం, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం, పొందూరు

 

➡️