స్పీకర్‌ దంపతులు అరసవల్లి సందర్శన

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని శాసన సభ స్వీపకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో

చిత్రపటాన్ని స్వీకరిస్తున్న స్పీకర్‌ సీతారాం దంపతులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని శాసన సభ స్వీపకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ సంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. స్వామివారి సేవల్లో పాల్గొన్న అనంరతం వారికి అనివేటి మండపంలో స్వామివారి శేష వస్త్రాలను కప్పి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే హైదరాబాద్‌ బెంచ్‌ హనరబుల్‌ జ్యూడిషియల్‌ మెంబర్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) డాక్టర్‌ వెంకట రామకృష్ణ బద్రినాథ్‌ నందుల అరసవల్లి సందర్శించారు. ఆయనకు జ్ఞాపికను ఆలయ ఇఒ డి.ఎల్‌.వి.రమేష్‌బాబు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు లుకాలపు గోవిందరావు పాల్గొన్నారు. రూ. 9.56 లక్షల ఆదాయంఅరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి మాఘ ఆదివారం కావడంతో యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీనివల్ల ఆలయానికి ఒక్కరోజు రూ.9.56 లక్షల ఆదాయం సమకూరినట్టు ఇఒ రమేష్‌బాబు తెలిపారు. టిక్కెట్లు రూపేనా రూ.4,72,300, విరాళాల రూపంలో రూ.1,79,237లు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.3,05,000లు ఆదాయం సమకూరినట్టు వివరించారు.

 

➡️