26న అరసవల్లి హుండీ లెక్కింపు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని హుండీల ఆదాయాన్ని ఈ నెల 26న లెక్కిస్తున్నట్టు ఆలయ ఇఒ వి.హరిసూర్యప్రకాష్‌ ఒక ప్రకటనలో

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని హుండీల ఆదాయాన్ని ఈ నెల 26న లెక్కిస్తున్నట్టు ఆలయ ఇఒ వి.హరిసూర్యప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, యాత్రికులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో లెక్కింపు చేపడతామని తెలిపారు.

➡️