26న చంద్రబాబు రాక

ఈనెల 26వ తేదీన తెలుగుదేశం

మాట్లాడుతున్న ఎస్‌.వి రమణ మాదిగ

  • శ్రీకాకుళంలో రా.. కదలి రా సభ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈనెల 26వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రోడ్డు వద్ద ఆరోజు నిర్వహించే రా.. కదలి రా బహిరంగ సభలో ఆయన పాల్గోనున్నారు. ఈ సభకు సుమారు అధిక సంఖ్యలో జనాలు హాజరయ్యేలా ఆ పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ సభను టెక్కలిలో నిర్వహించాలని భావించినా, జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో జనాలు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో స్థలాభావం ఏర్పడుతుందని భావించారు. దీంతో ఈ సభను జిల్లా కేంద్రానికి మార్చారు.సభను విజయవంతం చేయాలిరా… కదలి రా బహిరంగ సభను జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సభా నిర్వాహక కమిటీ సభ్యులు ఎస్‌.వి రమణ మాదిగ కోరారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సభకు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరానున్నట్టు తెలిపారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులోని ఖాళీ స్థలంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, బొనిగి భాస్కరరావు, అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ వాలంటీర్లను వైసిపి బూత్‌ ఏజెంట్లుగా పనిచేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పడం సరికాదన్నారు. ఐదేళ్లుగా ప్రజా ధనాన్ని గౌరవ వేతనంగా పొందుతున్న వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా, బానిసలుగా పనిచేయాలని ఆదేశించడం అప్రజాస్వామికమన్నారు. వాలంటీర్లపై వైసిపి నాయకులకు ఉన్న భావన మరోమారు బయటపడిందన్నారు. ఇప్పటికైనా వాలంటీర్లు వైసిపి నాయకుల నైజాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, నాయకులు వి.సూరిబాబు, ప్రదాన విజయరాం తదితరులు పాల్గొన్నారు.

➡️