క్వాలిటీ కియోస్కో’కు 33 మంది ఎంపిక

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 2023-24లో ఇసిఇ, సిఎస్‌ఇ, ఐటి కోర్సులు పూర్తి చేసిన 33 మంది విద్యార్థులు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న క్వాలిటీ కియోస్కో టెక్నాలజీస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.వి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని ఎంపిక చేస్తూ క్వాలిటీ కియోస్కో టెక్నాలజీస్‌ జాబితాను కళాశాలకు పంపిందన్నారు. వార్షిక వేతనంగా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు వరకు చెల్లించేందుకు ఆ కంపెనీ అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అభినందిస్తూ క్రమశిక్షణతో శ్రమించి పనిచేస్తూ ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, ఇసిఇ హెబ్బడి డాక్టర్‌ బి.రామారావు, సిఎస్‌ఇ హెచ్‌డి డాక్టర్‌ యు.డి.ప్రసన్న, ఐటి హెచ్‌డి డాక్టర్‌ వై.రమేష్‌, ప్లేస్‌మెంట్‌ అధికారి డాక్టర్‌ ఎం.వి.ఎస్‌.ఎస్‌.కుమార్‌లు అభినందించారు.

 

➡️