50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభం

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా స్థానిక ప్రభుత్వ మెడికల్‌

పాల్గొన్న కలెక్టర్‌, తదితరులు

వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వద్ద 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ రూ.23.75 కోట్లతో నిర్మించను న్నారు. ఈ బ్లాక్‌ నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో ఆదివారం శంకుస్థాపన చేశారు. గుజరాత్‌ రాష్ట్రంలోని రాజకోట్‌లో జరిగిన సమావేశం నుంచి దేశ వ్యాప్తంగా హెల్త్‌ కేర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రాలో 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను వర్చుల్‌గా శంకుస్థాపనలు చేశారు. అందులో జిల్లాలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిజిహెచ్‌ మెడికల్‌ కళాశాల నుంచి లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా కలెక్టర్‌, ఎపిఎచ్‌ఎమ్‌ ఐడిసి ఇఇ ఎం.సత్యప్రభాకర్‌, సూపరెంటెండెంట్‌ స్వామినాథన్‌, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటాచలం, డిప్యూటీ సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ కె.సునీలానాయక్‌, హెచ్‌డిఎఫ్‌సి సలహా సభ్యులు, సిఎస్‌ఆర్‌ఎమ్‌ సుభాషిణి, ఎం సత్యానంద్‌, విద్యార్థినీ విద్యార్థులు తిలకించారు అనంతరం కలెక్టర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

 

➡️