8న చలో విజయవాడ

ఆశావర్కర్ల సమస్యలపై ఈనెల ఎనిమిదో

అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి – నరసన్నపేట, టెక్కలి, కొత్తూరు

ఆశావర్కర్ల సమస్యలపై ఈనెల ఎనిమిదో తేదీన చేపట్టే చలో విజయవాడకు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.నాగమణి, అధ్యక్ష, కార్యదర్శులు ధనలక్ష్మి, జి.అమరావతి పిలుపునిచ్చారు. ఆశావర్కర్ల సమస్యలపై టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పనిభారం తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, యాప్‌లు, సచివాలయ డ్యూటీలు రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వినతిపత్రాల్లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యేలు హామీనిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్‌, యూనియన్‌ నాయకులు అన్నపూర్ణ, రమణమ్మ, రాజేశ్వరి, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

➡️