సమ్మెపై ప్రత్యేక బుక్ లెట్స్ ఆవిష్కరణ

Jan 1,2024 16:11 #srikakulam
anganwadi workers strike 21 day sklm booklet

ప్రజాశక్తి-ఎచ్చెర్ల : అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. తమ సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీలు చేపట్టిన సమ్మె జనవరి 1న 21వ రోజు సమ్మె శిబిరాలలో తమ నిరసన కొనసాగించారు. అంగన్వాడీల సమ్మె ప్రత్యేక బుక్ లెట్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం వెయ్యి రూపాయలు వేతనం మాత్రమే పెంచిందని గత నాలుగు సంవత్సరాలుగా అంగన్వాడీల వేతనాలలో ఎటువంటి వ్యత్యాసం లేకపోతే ఏ విధంగా కుటుంబాలను పోషించుకోవాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 6,300/- రూపాయలు వేతనం పెరిగితే వైసిపి ప్రభుత్వం వచ్చాక 4,500/- రూపాయలు పెంచామని ముఖ్యమంత్రి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. గత నాలుగు సంవత్సరాల నుండి అనేక పర్యాయములు సంబంధిత అధికారులకు మంత్రివర్యులకు తెలియజేసినప్పటికీ నేటికి వేతనాలు పెంచకపోవడంతో కడుపుకాలి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీ అక్కచెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి అంగన్వాడీలను రొడ్డున పడేయడం సిగ్గుచేటన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యూటీ అమలు చెయ్యాలని తీర్పునిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యూటీ అమలు చెయ్యటంలేదని అన్నారు. అంగన్వాడీలకు 11,500 వేతనం ఇచ్చి అమ్మ ఒడి, ఆసరా,చేయూత, విద్యా దీవెన, విడో పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ వంటి సంక్షేమ పధకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ శారద, కనకం, లలిత, అమృత తదితరులు పాల్గొన్నారు.

➡️