ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు రాక

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో

పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్‌ అబ్జర్వర్‌)గా హర్యానాకు చెందిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి శేఖర్‌ విద్యార్థి మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ స్వాగతం పలికారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన కలెక్టర్‌ అనంతరం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై వివరించారు. ఆశిష్‌ విద్యార్థి బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే కంట్రోల్‌రూమ్‌లో పలు విభాగాల పనితీరును పరిశీలిస్తారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి శేఖర్‌ విద్యార్థి సాధారణ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, శ్రీకాకుళం ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య తదితరులున్నారు.

➡️