ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ఆన్‌లైన్‌ మోసాలపై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని

అవగాహన కల్పిస్తున్న సిఎఫ్‌ఎల్‌ కో-ఆర్డినేటర్‌ హరనాథ్‌

ఆమదాలవలస:

ఆన్‌లైన్‌ మోసాలపై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సిఎఫ్‌ఎల్‌ కో-ఆర్డినేటర్‌ హరనాథ్‌ అన్నారు. మండలంలోని బొబ్బిలిపేటలో ఆర్‌బిఐ పథకంలో భాగంగా యూనియన్‌ బ్యాంక్‌ సౌజన్యంతో ఎస్‌ఎస్‌టి స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు నుంచి మాట్లాడుతు న్నామని ఎవరైనా ఫోన్‌ చేసి అకౌంట్‌ వివరాలను అడిగితే సమాచారాన్ని ఇవ్వవద్దని సూచించారు. ఎటిఎంలో అపరిచితులకు డబ్బులు విత్‌డ్రా చేయమని ఎటిఎం కార్డును ఇవ్వరాదని తెలిపారు. రూపే ఎటిఎం కార్డుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ఇన్సూరెన్స్‌ పథకాలను వివరించారు. సైబర్‌ మోసాలకు గురైనప్పుడు 1930 ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌ మెన్‌ 14448 టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పుష్పలత, సిఎఫ్‌ఎల్‌ సిబ్బంది చిగురుపల్లి వెంకటేష్‌ (చిన్ను), రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️