రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

Jan 26,2024 16:01 #srikakulam
btech student died in road accident

ప్రజాశక్తి-కంచిలి : మండపల్లి పంచాయితీ ఒరియా నారాయణపురం గ్రామానికి చెందిన జన్ని గోపాల్ 25 సంవత్సరాలు అనే బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి తండ్రి లేడు తల్లి కూలి పనులు చేసుకుని పోషిస్తుంది. ఒక సోదరుడు వలస కూలీగా వేరే ప్రాంతం లో పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గోతిలో పడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో వేరొక యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి.

➡️