18న జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు

Feb 12,2024 12:12 #srikakulam
District Comprehensive Development Conference on 18

ప్రజాశక్తి – శ్రీకాకుళం : జిల్లా సమగ్రా అభివృద్ధి సదస్సు ఫిబ్రవరి 18న జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శ వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా సమగ్రా అభివృద్ధి ప్రచార కరపత్రాన్ని వారు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి ఎందుకు జరగలేదు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిందా లేదా వెనుకకు నెట్టవేయబడిందా?.స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా జిల్లా వెనుకబడ్డానికి కారకులు ఎవరిని వారు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి వంటి నదులు ఉన్నప్పటికీ. సువిశాల సాగుభూమి, సుదీర్ఘ సముద్రతీరము, అటవీ సంపద ఉన్నప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కాదా అని వారు ప్రశ్నించారు. జిల్లా సమగ్రా అభివృద్ధికై సదస్సులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసీదాసు గారు, పూర్వ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ ఎంవిఎస్ శర్మగారు, అదేవిధంగా గ్రేటర్ విశాఖ సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఉప్పలపాటి నారాయణరావు గారు అనేకమంది ప్రముఖులు , మేధావులు ఈ సదస్సులో ముసాయిదా పత్రాలని ప్రజెంట్ చేస్తారని, దీని మీద చర్చించి సమగ్ర అభివృద్ధికి సూచనలు తయారు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు.

➡️