ప్రతి వాహనం విధిగా తనిఖీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో

వాహనాల తనిఖీలను పరిశీలిస్తున్న రాఘవేంద్ర మీనా

ప్రజాశక్తి – పొందూరు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా అధికారులను ఆదేశించారు. మండలంలోని రాపాక కూడలి వద్ద చెక్‌పోస్టును ఆదివారం పరిశీలించి, స్వయంగా తనిఖీలు చేపట్టారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని సూచించారు.

➡️