మౌలిక సదుపాయాలు పరిశీలించాలి

పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సదు పాయాలు

మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సదు పాయాలు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ స్పష్టం చేశారు. కంట్రోల్‌ రూంలో పోల్‌ డే మేనేజ్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, లైటింగ్‌, పిడబ్ల్యూడి ఓటర్లకు సదుపాయాలు, జనరేటర్‌ తదితర సౌకర్యాలు తప్పక ఉండాల న్నారు. ఇవిఎంలపై దృష్టి సారించాలని, ఇవిఎంలు పనిచేయక పోయినా వెంటనే సెక్టార్‌ అధికారులను సంప్రదించి ప్రత్యామ్నా యంగా వేరొక ఇవిఎంలు తీసుకొనేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సెక్టార్‌ అధికారుల వద్ద ఇవిఎంలు రిజర్వ్‌లో ఉంటా యన్నారు. జిపియస్‌ వ్యవస్థ ద్వారా వాహనాల సమాచారాన్ని తెలుసుకోవాల న్నారు. ఈ సమావేశంలో స్వీప్‌ నోడల్‌ అధికారి, డిఆర్‌డిఎ పిడి పి.కిరణ్‌ కుమార్‌, ఎంసిసి నోడల్‌ అధికారి సిపిఒ లక్ష్మీ ప్రసన్న, ఇవిఎంల నోడల్‌ అధికారి కె.సుధ, ఎపిఎంఐపి డిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️