ఎన్నికల్లో వైసిపికి బుద్ధి చెప్పడం ఖాయం

ఐదేళ్ల వైసిపి అరాచక పాలనకు ప్రజలు

ప్రచారం చేస్తున్న గొండు శంకర్‌

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఐదేళ్ల వైసిపి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ పేర్కొన్నారు. నగర పరిధిలోని 38వ డివిజన్‌లో ఇన్‌ఛార్జిలు కొమర కమల, బుర్రా ప్రసాద్‌ ఆధ్వర్యాన ప్రజాగళం, బాబు సూపర్‌ సిక్స్‌ పధకాల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పధకాలను, ఉమ్మడి మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాయకులకంటే ప్రజలే ఎన్నికల కోసం ఆత్రుతగా వున్నారని, వైసిపి పాలనతో విసిగిపోయి కూటమికి పట్టం కట్టేందుకు ఎదురు చూస్తు న్నారన్నారు. మంత్రి ధర్మాన నగరాభివృద్దికి ఏంచేశారని ప్రశ్నించారు. కనీసం గడచిన ఐదేళ్లుగా మరమ్మతులకు కూడా నిధులు తీసుకురాలేక పోయారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు చాలక పేదల భూములు దోచుకోడానికే భూరక్ష చట్టం తెచ్చారన్నారు. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడుతో పాటు తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, టిడిపి నాయకులు బుర్రా సత్తిబాబు, తంగుడు చంద్రరావు, మైలపల్లి నర్సింహమూర్తి, మైలపల్లి రాజు, కేశవ రాంబాబు పాల్గొన్నారు.

 

➡️