ఎమ్మెల్యే రెడ్డిశాంతి ఇంటింటి ప్రచారం 

Apr 11,2024 13:42 #srikakulam

ప్రజాశక్తి-పాతపట్నం : పాతపట్నం మండలంలోని పెద్దసీది, తామర, తీమర పంచాయతీలలో గురువారం ఉదయం ప్రతి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తులకువివరించారు. మళ్లీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్నం అత్యధిక ఓట్ వేసి గెలిపించాలని, మళ్లీ జగనన్న సీఎం అయితే మన రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్, ఏఎంసీ చైర్మన్ కొండల అర్జునరావు, సచివాలయం కన్వీనర్ సూర్యం, స్థానిక సర్పంచ్ మరియు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️