ఊకతో వాహనదారుల అవస్థలు

రైస్‌మిల్లు పక్కన గల ధాన్యం ఊక రహదారిపైకి ఎగురుతూ

తోలాపి వద్ద రహదారి పైకి ఎగురుతున్న ధాన్యం ఊక

ప్రజాశక్తి- పొందూరు

రైస్‌మిల్లు పక్కన గల ధాన్యం ఊక రహదారిపైకి ఎగురుతూ కనిపిస్తున్న ఈ దృశ్యం మండలం తోలాపి గ్రామ సమీపంలోనిది. రైస్‌మిల్లులో ధాన్యం ఆడితే వచ్చిన ఊక రక్షణగోడ లేకపోవడంతో రహదారిపైకి ఎగురుతుంది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో ప్రయాణించే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దఎత్తున గాలి వీస్తుండడంతో ఆ ఊక వాహనదారుల కంటిలో పడుతుందని, దీంతో ప్రమాదాల బారినపడే అవకాశం ఉందంటూ వాహన దారులు వాపోతున్నారు. ఊక రహదారిపైకి ఎగరకుండా రక్షణ గోడను నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.

 

➡️