దాతృత్వం చాటుకున్న యునైటెడ్ బ్రూవరీస్ కార్మికులు

Feb 15,2024 11:56 #srikakulam
Philanthropic United Breweries workers

ప్రజాశక్తి – రణస్థలం : రణస్థలం మండలంలో గల యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు ఎస్.మాలచ్చి అనారోగ్యంతో చనిపోయారు. స్పందించిన తోటి కార్మికులంతా యునైటెడ్ బ్రూవరీస్ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో తమ ఒక రోజు వేతనం రూ. 2,40,105 విరాళంగా సేకరించారు. ఈ విరాళాన్ని చనిపోయిన కార్మికుడి కుటుంబ సభ్యులకు గురువారం పరిశ్రమ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, యునైటెడ్ బ్రూవరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఐ.నారాయణరావు, జె.గంగరాజు చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అమ్మన్నాయుడు మాట్లాడుతూ యుబి కార్మికులకు యాజమాన్యం పూర్తిస్థాయి పనిదినాలు కల్పించకపోయినా తమ ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. సిఐటియు సభ్యులు హక్కులు కోసం పోరాటాలే కాకుండా తోటి కార్మికులను ఆడుకోవడంలో ముందుంటారని అన్నారు. ఈ విరాళాన్ని చనిపోయిన కార్మికుడి భార్య నారాయణమ్మకు అందజేసారు. విరాళాన్ని అందజేసిన వారిలో వెలమల.రమణ, సత్యన్నారాయణ తదితరులు ఉన్నారు.

➡️