కిడ్నీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన

Mar 23,2024 16:19 #srikakulam

ప్రజాశక్తి-కంచిలి : కంచిలి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం న్యాయ విజ్ఞాన సదస్సుతోపాటు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జునైడ్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉద్దానం ప్రాంతంలో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వారికి మెరుగైన చికిత్స పద్ధతులను ఈ సదస్సుల ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ అర్ సన్యాసినాయుడు, డిఎం అండ్ హెచ్ ఓ మీనాక్షి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

➡️