టెక్కలిలో పలువురు వాలంటీర్ల రాజీనామా

Apr 5,2024 16:16 #srikakulam

ప్రజాశక్తి-టెక్కలి రూరల్ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి గ్రామ సచివాలయం 1 పరిధిలోని పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేస్తూ శుక్రవారం పంచాయతీ కార్యదర్శి బి.మల్లేశ్వరావుకు రాజీనామా పత్రాలను అందించారు. టెక్కలి గ్రామసచివాలయం 1 పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రమీల, కుమారి, జయ, లేపాక్షిలు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్నకు ముఖ్యమంత్రి చేయాడినికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

➡️