భద్రతా సిబ్బంది అప్రమత్తం

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌

పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ సమీపిస్తున్న వేళ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పి జి.ఆర్‌.రాదిక ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవిఎంలు మండలంలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరచిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మూడంచెల భద్రతను బుధవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో 24ఞ7 నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ క్రమంలో గార్డు రిజిస్టర్‌లో సంతకం చేశారు. సిబ్బంది నిర్వహిస్తున్న గార్డు భద్రతా సరళిని పర్యవేక్షించారు. అలాగే నగరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లను తనిఖీ చేశారు. గార్డులను నియమించిన సిబ్బంది వివరాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిఎన్‌ కాలనీ రెండో లైన్‌ బీట్‌ సిబ్బంది పనితీరును పరిశీలించారు. పకడ్బందీగా గస్తీ విధులు నిర్వహించి నేర నియంత్ర చర్యలు చేపట్టాలని సూచించారు. టౌన్‌ పరిధిలో విస్తృతంగా పెట్రోలింగ్‌ నిర్వహించి అనుమానం ఉన్న కొత్త వ్యక్తులపై, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని సూచించారు. ఈమె వెంట టూ టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ ఉన్నారు.

➡️