ఓటు హక్కు వజ్రాయుధం 

Apr 12,2024 13:05 #srikakulam

ప్రజాశక్తి – ఆమదాలవలస : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు వజ్రాయుధమని మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ కె.రాజేష్ కుమార్ అన్నారు. ఓటు హక్కు చైతన్యంపై (స్వీప్) అవగాహనలో భాగంగా శుక్రవారం మునిసిపల్ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అర్హులందరూ తప్పనిసరిగా ఓటుహక్కు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మహిళల్లో ఓటుహక్కు వినియోగంపై అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, సిబ్బంది, పట్టణ, స్లం సమాఖ్యల ఆర్పీలు పాల్గొన్నారు.

➡️