కులవృత్తి వారికి న్యాయం చేస్తాం

Apr 12,2024 14:42 #srikakulam

ప్రజాశక్తి-బూర్జ : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులవృత్తుల వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మాజీ విప్ ఆముదాలవలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ హామీ ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని కురుంపేట గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన వెంకటేష్ అను వ్యక్తి కులవృత్తిదారులకు ప్రభుత్వ హాయంలో ఇటువంటి న్యాయం జరగలేదని ఇంకా తాము అన్ని విషయాల్లోనూ వెనుకబడి ఉన్నామని ప్రేమ్ కుమార్ కు వినతిపత్రంలో తెలిపారు. దీనిపై స్పందించిన కూన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే అన్ని రకాల కొలవృత్తుల దారులను ఆదుకోవడమే కాకుండా అన్ని పథకాలు వర్తించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలోని ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం సమపాలల్లో అమలు జరుగుతుందని అన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వ హాయంలో రాష్ట్రం ఆధోగతి పాల అయిందని అన్నారు అరాచకపు పాలనకు చర్మ గీతం పాడవలసిన అవసరం ఎంతయిందో అన్నారు. ఓటర్లు ప్రజలు గుర్తించాలని అన్నారు. ఆయనతోపాటు స్థానిక సర్పంచ్ కొరికిన వెంకట సీతారామరాజు మాజీ ఎమ్మెల్సీ వీరికట్ల విశ్వప్రసాద్ మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏ రామకృష్ణ ఆముదాలవలస నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ రామ్మోహన్ టిడిపి మండల అధ్యక్షులు వి సీతారాం బాబు నాయుడు, జనసేన మండల అధ్యక్షులు కొత్తకోట నాగేందర్, జనసేన ఎంపిటిసి సభ్యులు ఎంపీలు విక్రమ్, సర్పంచ్లు అంపిలి గణపతిరావు, టిడిపి నాయకులు పీరికట్ల ప్రభాకర్ రావు, సీత, బాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️