డొనేషన్లు వేసుకుని గెలిపించుకుంటాం

Mar 24,2024 13:40 #srikakulam

గుండ వర్గీయులు ప్రకటన
ప్రజాశక్తి – శ్రీకాకుళం : డొనేషన్లు వేసుకుని గుండ లక్ష్మి దేవినీ గెలిపించుకుంటామని గుండ వర్గీయులు ప్రకటించారు. అరసవల్లిలోని గుండ నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టిడిపి టిక్కెట్ నిరాకరించడంపై వారు మండిపడ్డారు. పార్టీ వద్దనుకున్నప్పడు పార్టీలో ఎందుకుండాలి అని కార్యకర్తలు ప్రశ్నించారు. లక్ష్మిదేవి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ పార్టీ నిర్ణయంపై రెండు రోజులు వేచి కూడా చూద్దామని అన్నారు. సమావేశానికి టిడిపి, జనసేన కార్య కర్తలు హాజరయ్యారు.

➡️