వైసిపి హయాంలో కుంటుపడిన అభివృద్ధి

Apr 12,2024 21:29

ప్రజాశక్తి-నెల్లిమర్ల : వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని జనసేన అభ్యర్థి లోకం మాధవి తెలిపారు. మండలంలోని దన్నానపేట, కొత్తపేట, సీతారామునిపేట, గొర్లిపేటలో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల కూలీల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం అవరమైతే తానే కూలీగా మారి అండగా నిలుస్తానన్నారు. అధికార వైసిపి దోచుకోవడం, దాచుకోవడం తప్ప సామాన్యుల సమస్యలు పట్టించుకోలేదని తెలిపారు. గొర్లిపేటలో టిడిపికి చెందిన మాజీ వార్డు సభ్యులు పప్పల రాము తన అనుచరులతో జనసేన పార్టీలో చేరారు. ఈ ప్రచారంలో తెలుగు మహిళా పార్లమెంట్‌ అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి, టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మునాయుడు, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు,నాయకులు గురాన అసిరినాయుడు, లెంక అప్పల నాయుడు, జనసేన నాయకులు పతివాడ అచ్చెన్నాయుడు, గడల అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️