మలేరియా పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలి : సూరజ్ గానోరే

ప్రజాశక్తి – రంపచోడవరం : ఏజెన్సీలోని ఏడు మండలాల్లో మలేరియా పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు అన్ని మండలాలలోని గ్రామాలలో ప్రతి ఇంటికి మలేరియా స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గానోరే పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారి ఛాంబర్ లో ఎ డి యం &హెచ్ఓతొ మలేరియా శాఖ అధికారులతో, సబ్ యూనిట్ అధికారులతో, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యాధికారులతో మలేరియా వ్యాధి నివారణ కొరకు కొంతమంది అధికారులతో సమావేశం, మరి కొంతమంది అధికారులతో కాన్ఫరెన్స్ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గానోరే మాట్లాడుతూ ఏజెన్సీలోని మలేరియా వ్యాధి నిర్మూలించేందుకు ఈనెల 15వ తేదీ నుండి మలేరియా స్ప్రేయింగ్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ మలేరియా స్ప్రేయింగ్ కు సంబంధించిన ఎన్ని పంపులు ఉన్నవి ఆయన ఆరా తీశారు. ఏజెన్సీలోని ప్రతి ఇంటిలో మలేరియా స్ప్రేయింగ్ చేయించి మలేరియా దోమలు ఉత్పత్తి అవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలోని ఎవరికైనా మలేరియా లక్షణాలు ఉన్న వారిని వెంటనే రక్త పరీక్షలు చేసి మలేరియా జ్వరాలకు సంబంధించిన మందులు రోగుల అందజేయాలని ఆయన అన్నారు. రక్త నమూనాలకు సంబంధించిన కిట్లు, మలేరియా జ్వరములకు సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో సిద్ధంగా ఉంచాలని ఆయన అన్నారు. ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఎన్ని మలేరియా కేసులు నమోదయినవి ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా వైద్యాధికారులను, సబ్ యూనిట్ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాల నుండి ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని మలేరియా కేసులు నమోదు అయినవి ప్రాజెక్ట్ అధికారి వైద్యాధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీలోని పూర్తిస్థాయిలో మలేరియా జ్వరాలు నిర్మూలించే విధంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. ఏజెన్సీలోని ఒక్కొక్క మండలంలో ఏఏ గ్రామాలలో మలేరియా స్ప్రేయింగ్ చేసింది అప్పటికప్పుడు నివేదికల సమర్పించాలని  ాయన అధికారులను ఆదేశించారు.  ఏజెన్సీలోని ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గ్రామాలలో మలేరియా స్ప్రింగ్ చేయించినప్పుడు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్యాధికారులతో మలేరియా స్పెల్లింగ్ చేసినట్టు సర్టిఫికెట్లు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఎడియం &హెచ్ ఓ జి.ప్రకాశం, మలేరియా ఏఎంఓ నక్క వెంకటేశ్వరరావు, రామకృష్ణ, యస్ఓ టీ.మార్తమ్మ, సబ్ యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️