కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

ప్రజాశక్తి-రాయచోటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్‌ కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వివరించారు. గురువారం విజయవాడలోని సచివాలయం నుండి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు భద్రతా చర్యలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌తోపాటు డిఆర్‌ఒ సత్యనారాయణ రావు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ చిన్న చిన్న సంఘటనలు మినహా అందరి సమిష్టి కషి, భాగస్వామ్యంతో ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నిక లను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అదే స్పూర్తితో జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళిక మేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేసుకొని కౌంటింగ్‌ ప్రక్రియను విజయ వంతం చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గద ర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటిం చేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా ముందస్తుగా పటిష్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పాత్రికే యులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సంద ర్భంగా అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ పార్ల మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం అన్నింటికీ రాయచోటి సాయి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో సిసి కెమెరాల నిఘాలో కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. పార్లమెంట్‌, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు కౌంటింగ్‌ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని, ఇవిఎం స్ట్రాంగ్‌ రూముల నుంచి కౌంటింగ్‌ కేంద్రానికి ఇవిఎంలను తీసుకొచ్చే దారిలో సిసి కెమెరాలు, బ్యారికేడింగ్‌, కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఏజెంట్లు అధికా రులకు విడిగా బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేశామని, ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మేరకు కౌంటింగ్‌ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తు న్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కౌంటింగ్‌ కేంద్రంలో మూడం చెల భద్రతను ఏర్పాటు చేశామని, కౌంటింగ్‌ కేంద్రాలు స్ట్రాంగ్‌ రూముల వద్ద ప్రత్యేక భద్రత బలగాలను ఏర్పాటు చేశామన్నారు. మీడియా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్‌ బ్యాలెట్‌, ఇవిఎంలలో పోలైన ఓట్ల కౌంటింగ్‌ కొరకు అదనంగా ఎఆర్‌ఒలను, కౌంటింగ్‌ సూపర్వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వ్‌లను నియ మించామని తెలి పారు. కౌంటింగ్‌ నిమిత్తం నియమించిన సిబ్బం దికి శిక్షణ కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో కౌంటింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా సాఫీగా విజయవంతంగా నిర్వ హించేందుకు అన్ని విధాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️