రైల్వే అభివృద్ధి కోసం పోరాటం

Jun 16,2024 22:16
ఫొటో : మాట్లాడుతున్న బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షేక్‌ నూరుద్దీన

ఫొటో : మాట్లాడుతున్న బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షేక్‌ నూరుద్దీన

రైల్వే అభివృద్ధి కోసం పోరాటం

ప్రజాశక్తి-బిట్రగుంట : బిట్రగుంట రైల్వే అభివృద్ధి కోసం అలుపు ఎరుగని పోరాటాన్ని చేస్తామని బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షేక్‌ నూరుద్దీన్‌ పేర్కొన్నారు. ఆదివారం బోగోలు సెంటర్లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ ఆనంద్‌ సాగర్‌, మానవ హక్కుల కమిటీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు దాసరి సునీల్‌, జై భీమ్‌ అంబేద్కర్‌ సేవాదళ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు రవిచంద్ర రైల్వే విశ్రాంత కార్మికులు ఆరోగ్యరాజ్‌, భాగ్యరాజ్‌, వ్యాపార సంఘ నాయకులు మైకేల్‌, జహీర్‌, బిట్రగుంట వాకర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కుందుర్తి శ్రీనివాసులు, తదితరులు పాల్గొని బిట్రగుంట రైల్వే పరంగా అభివృద్ధి చేసేందుకు శతవిధాల కృషి చేసి, ప్రజలను చైతన్యం చేసి, బిట్రగుంట రైల్వే ప్రగతి సాధిస్తామని అందుకు నెల్లూరు జిల్లా సంబంధించిన అధికార పార్టీ ఎంపిలు మంత్రులు ఎంఎల్‌ఎలు అందరిపై ఒత్తిడి తీసుకొచ్చి బిట్రగుంట రైల్వే ప్రగతిని సాధిస్తామని తీర్మానించారు. కార్యక్రమంలో బాంబే వేణు, రాజన్‌, ఓం శ్రీ, బోగోలు, విశ్వనాథరావుపేట వ్యాపారస్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

➡️