మండపేట తహశీల్దార్ గా సురేష్ బాబు

Feb 7,2024 11:42 #Konaseema, #mandapeta

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట తహశీల్దార్ గా సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన  ఇక్కడికి విచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్  కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి ఇక్కడ బదిలీపై వచ్చారు. గత 2019 ఎన్నికల్లో రామచంద్రపురం తహశీల్దార్ గా ఆయన పనిచేశారు. మండలంలోని గ్రామాల్లో పర్యటించి ఇక్కడి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. డిప్యూటీ తహశీల్దార్ పద్మ, ఆర్ ఐ కంఠం శెట్టి గౌరీ దేవి, వి ఆర్ ఓ లు ఆయనకు అభినందనలు తెలిపారు.

➡️