అవినీతి కేసులో తొందరలోనే జగన్ జైలుకు

Nov 26,2023 11:52 #Kurnool
tdp campaign against ycp govt

ప్రజాశక్తి-ఆదోని : అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లో జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌ని ఆదోని టీడీపీ మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె అది కృష్ణ‌మ్మ అన్నారు. ఆదోని శివారు బైపాస్ లోని మండ‌గిరి ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టోలోని పేర్కొన్న పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడారు టీడీపీ అధికారంలో వ‌స్తే అమ‌లుచేసే సూపర్ సెక్స్ పథకాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ముఖ్యమంత్రి జగన్‌కు రెండోసారి తీహార్‌ జైలు తప్పదన్నారు. హైకోర్టు తీర్పులని కూడా ధిక్కరిస్తూ ఏం ఉద్ధరిద్దామని ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి మారుస్తున్నారో జగన్‌రెడ్డే ప్ర‌జ‌ల‌కు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు వడ్డేమాన్ గోపాల్ పాల్గొన్నారు.

➡️