పలుచోట్ల టిడిపి అభ్యర్థులు ప్రచారం

Apr 27,2024 21:39

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కురుపాం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని మేదరగండ, బుడ్డెంఖర్జ, బాలేసు కొత్తవలస గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిడిపి ప్రజలకు వివరించారు. ఐదేళ్లు వైసిపి పాలనలో గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి లేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి బిడ్డిక పద్మావతి , రాష్ట్ర కార్యదర్శి వైరి వీరేశ్‌ దేవ్‌, రాష్ట్ర యువ నాయకులు కోలా రంజిత్‌ కుమార్‌, మండల కన్వీనర్‌ పాడి సుదర్శన్‌ రావు, కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.కొత్త గూడలో టిడిపి ఆత్మీయ సమ్మేళనం గుమ్మలక్ష్మీపురం : టిడిపి సీనియర్‌ నాయకులు బిడ్డిక పద్మావతి తెలుగు మహిళా కార్యనిర్వహక కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మండలంలోని కొత్తగూడలో ఆత్మీయ సమ్మేళనం సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ నాడు మనుషులు కలిశారు.. నేడు మనసులు కలిశాయి అన్నారు. ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉండడంతో మనసులో ఎటువంటి భావాలు ఉన్నా పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి జగదీశ్వరిని గెలిపిద్దాం అన్నారు. అనంతరం పద్మావతిని సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్ర దేవ్‌, టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, జియమ్మవలస ఎంపిపి బొంగు సురేష్‌, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల కన్వీనర్లు కొండయ్య, పాడి సుదర్శన రావు, జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేష్‌ , అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, నాయకులు కోలా రంజిత్‌ ఉన్నారు.కర్రివలసలో టిడిపి ఎన్నికల ప్రచారం పాచిపెంట : మండలంలోని కర్రివలసలో శనివారం టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ఎక్కువమంది ఉపాధి హామీ పనుల్లో పాల్గొనడంతో వారి వద్దకే ఆమె వెళ్లి టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు గురించి వివరించి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు. ప్రచారంలో మండల టిడిపి అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్‌బాబు, రౌతు తిరుపతిరావు, కొత్తల పోలినాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాలూరురూరల్‌ : మండలంలోని కుర్మరాజుపేట, పునికిలివలస, చిన్నవలస గ్రామాల్లో టిడిపి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో టిడిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటవుతుందని అప్పుడు సామాన్యులకు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామని తెలిపారు. దీనికోసం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను కరపత్రం ద్వారా అందరికీ తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, సర్పంచ్‌ ఎ.నళిని, నాయకులు పాల్గొన్నారు.పలువురు టిడిపిలో చేరిక కురుపాం : కురుపాం మేజర్‌ పంచాయతీ పరిధిలో గల చెరువుకొమ్మవలసకు చెందిన వార్డు మెంబర్‌ కందుల బాలకృష్ణ, ఆ గ్రామంలో 40 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలోకి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం టిడిపిలో చేరారు. వీరికి వీరేష్‌ చంద్రదేవ్‌ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, మాజీ ఎంపిపి రమణమూర్తి, నాయకులు మంత్రి త్రిపురనాథ్‌, కర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️