టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లాకు సన్మానం

పల్లా శ్రీనవాస్‌ను కలిసిన యాదవ సంఘం నాయకులు

ప్రజాశక్తి – బుచ్చయ్యపేట :

టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన పల్లా శ్రీనివాసరావును ఆ పార్టీ మండల అధ్యక్షులు గోకివాడ కోటేశ్వరరావు, వడ్డాది టౌన్‌ ఉపాధ్యక్షులు సింగంపల్లి రమేష్‌ తదితరులు మంగళవారం గాజువాకలో కలిసి సన్మానం చేశారు. కార్యక్రమంలో సయ్యపరెడ్డి జగదీష్‌ పాల్గొన్నారు. యాదవ సంఘం ఆధ్వర్యాన అనకాపల్లి : టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావును, విశాఖ దక్షణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను అనకాపల్లి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు భరణికాన సాయినాధబాబూరావు ఆధ్వర్యంలో మంగళవారం కలిసి పుష్పగుచ్ఛాలు, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు భరణికాణ నరసింహమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీనివాసరావు, నాయకులు పంచదార్ల సూరిబాబు, వియ్యపు సింహాచలం, బంధం వెంకటరమణ, వియ్యపు అప్పలరాజు, కోన సోమేశ్వరరావు, కోరాడ శ్రీనివాసరావు, మొల్లి కనకరాజు, గజ్జి నరసింగరావు, నరేష్‌, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️