పేటలో టిడిపిదే గెలుపు

పాయకరావుపేట నియోజకవర్గం

ఎమ్మెల్యే అభ్యర్థి అనితను కలిసి ధీమా వ్యక్తం చేసిన శ్రేణులు

ప్రజాశక్తి- నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి వంగలపూడి అనిత విజయకేతనం ఎగురవేయడం ఖాయమని టిడిపి ముఖ్య నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నక్కపల్లి క్రిష్‌ టౌన్‌ షిప్‌లోని పాయకరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితను కలిశారు. నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిని ఆమె దృష్టికి తీసుకెళ్లి, పలు అంశాలపై చర్చించారుఈ సందర్భంగా.పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌ రాయవరం, కోటవురట్ల మండలాల పార్టీ అధ్యక్షులతో పోలింగ్‌ సరళి, ఓటింగ్‌ తీరుపై ౖ అనిత చర్చించారు .ఆయా మండలాలకు సంబంధించిన నేతలు గ్రామాల వారీగా రిపోర్టును అనిత దష్టికి తీసుకువెళ్లారు. లెక్కలు, సమీకరణలు వేసి, పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీగా బిజెపి అభ్యర్థి సీఎం రమేష్‌ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి ముఖ్య నేతలు కొప్పిశెట్టి వెంకటేష్‌ ,కొప్పిశెట్టి బుజ్జి ,పెద్దిరెడ్డి చిట్టిబాబు, అమలకంటి అబద్ధం, జానకి శ్రీను పాల్గొన్నారు.

.పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్న అనిత

➡️