సమస్యలుంటే చెప్పండి

Jun 16,2024 20:57

ప్రజాశక్తి- భోగాపురం: గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే తనకు చెబితే పరిష్కరిస్తానని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ఆదివారం తన స్వగృహంలో నెల్లిమర్ల మండలం గరికిపేట గ్రామానికి చెందిన టిడిపి, జనసేన నాయకులు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. గరికిపేట మాజీ సర్పంచ్‌ చింతపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గరికిపేట గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల్లో టిడిపి నాయకులు చాలా కష్టపడి గతం కంటే ఎక్కువ మెజార్టీ సాధించారని ఆ గ్రామాన్ని తాను గుర్తించుకుంటానని చెప్పారు. గ్రామంలో యువత జాబితాను సిద్ధం చేసి తనకు ఇస్తే ఉద్యోగవకాశాలు కల్పిస్తామని మాజీ సర్పంచ్‌ చింతపల్లి సత్యనారాయణకు సూచించారు. అనంతరం ఆమెను నాయకులు దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింతపల్లి అప్పలనాయుడు, టిడిపి నాయకులు బెల్లాన అచ్చుంనాయుడు, మహంతి రాజారావు, మహంతి శ్రీను, పతివాడ రమణ, వార్డు మెంబర్లు బెల్లాన బంగారునాయుడు, తిమనాని ఆదినారాయణ, బెల్లాన ఆదినారాయణ, నాయకులు మహంతి నాగభూషణరావు, బెల్లాన త్రినాద్‌, బెల్లాన మోహన్‌, జనసేన నాయకులు బెల్లాన స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️