ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, చీరలకు పూజలు చేసి అంగన్వాడీల నిరసన

Dec 24,2023 16:05 #Anganwadi strike, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై  బైఠాయించి ప్రభుత్వం ఇచ్చిన నాసిరకమైన ఫోన్లు, చీరలకు పూజలు చేసి తమ యొక్క నిరసనను తెలియజేశారు. వీటి కోసమేనా కోట్లు ఖర్చు పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోన్లు పని చేయవని, చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆవేదన చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడ్రాజు మాట్లాడుతూ.. అయ్యా ధరలు పెరిగాయి, మీరిచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం… మీరిచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా జీతం ఇవ్వాలని అడిగితే.. చీరలకు సెల్ఫోన్లకు పెట్టిన ఖర్చు మంత్రులు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు, పెన్షన్‌, గ్రావిటీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెకు ఏపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ వి.పైడిరాజు, జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మీ తదితరులు తదితరులు మద్దతు ప్రకటించారు.

➡️