ఫీజు వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలి

ప్రజాశక్తి-చీమకుర్తి : చీమకుర్తి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని , ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎంఇఒ కె. శివాజీకి వినతిపత్రం అందజేశారు. స్థానిక ఎంఆర్‌సి భవనంలో ఎంఇఒ శివాజీని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జి.దేవరాజ్‌ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు అనుమతి లేకుండా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిన్నట్లు తెలిపారు. ఎక్కువ ధరలకు పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక ఫీజులు వసూలు చేయకుండా ఫీజు వివరాలను నోటీసు బోర్డులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు వాసుబాబు, నాయకులు ఎస్‌కె. నాగుల్‌మీరా,ఇత్తడి శ్రీకాంత్‌,దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

➡️