మేడే స్ఫూర్తితో మతోన్మాద శక్తులను ఓడించాలి

May 1,2024 21:24

ప్రజాశక్తి – సీతానగరం : మేడే స్ఫూర్తితో మతోన్మాద శక్తులను ఓడించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటియు జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చిందని, ఈ విధానాలను తిప్పుకొట్టేందుకు కార్మిక వర్గమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని బిజెపికి అనుకూలంగా ఉన్న వైసిపి, టిడిపి, జనసేనను ఓడించి లౌకిక ప్రజాస్వామ్య పార్టీలను గెలిపించుకునే బాధ్యత రాష్ట్ర ప్రజానీకంపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి లక్ష్మునాయుడు, సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లాప్రధాన కార్యదర్శి జ్యోతిలక్ష్మి, శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.రామలక్ష్మి మధ్యాహ్నం భోజనకార్మిక సంఘం నాయకులు వి.శాంతకుమారి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆర్‌.రాము, టి.రమేష్‌, పి.కృష్ణ, ఎస్‌.శంకర్రావు, గ్రీన్‌ అంబాసిడర్‌ నాయకులు గౌరి, పలువురు అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం కార్మికులు పాల్గొన్నారు.

పార్వతీపురంటౌన్‌ : మేడే సందర్భంగా పట్టణంలో సిఐటియు ఆధ్వర్యాన పలుచోట్ల సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించి కార్మిక వర్గ పోరాటాలలో అమరులైన వారికి నివాలర్పించారు. ముందుగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ చేపట్టినంతరం మెయిన్‌ రోడ్డు మీదుగా నాలుగురోడ్ల జంక్షన్‌ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం సిఐటియు అనుబంధ సంఘాలు ఆర్‌టిసి కళాసీ, తోపుడుబండ్లు, కురుపాం ఆటో సెక్షన్‌, లోకల్‌ సెక్షన్‌, రైస్‌ మిల్లు కళాసీ, బెలగాం సుందరయ్య భవనం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్‌ నాయకులు రెడ్డి వేణు, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్మికుల మధ్య మత ఉన్మాదపు చర్యలతో ఐక్యతను చిన్నభిన్నం చేస్తుందని, కార్మిక చట్టాలను పూర్తిగా మార్చేసి పెట్టుబడి దారులకు తొత్తుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి జనసేన పార్టీలు బిజెపికి తొత్తులుగా మారడం చాలా ఆందోళనకరమని మండిపడ్డారు. కార్మిక హక్కుల చట్టాలు పకగ్బందీగా అమలు చేకూరిస్తేనే కార్మికులకు నిజమైన స్వాతంత్య్రమని, వాటి సాధనకై కార్మికులంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌.భానుమూర్తి, బి. సూరిబాబు, సింహాచలం, ఎస్‌.చిన్నరావు, జి.కష్ణ, పి.లక్ష్మణరావు, ఆర్‌. శ్రీదేవి, కెడి నాయుడు, జి.తులసి, ఎం.శివాని, గౌరమ్మ, ఎన్‌.శంకరరావు, సింహాచలం, ఎన్‌.మలేష్‌, శివ తదితరులు పాల్గొన్నారు..ఇ

ప్టూ, ఎఐకెఎంఎస్‌ ఆధ్వర్యంలో …పట్టణంలో ఇప్యూట, ఎఐకెఎంఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు జరిగాయి. ముందుగా బెలగాం సెంటర్లో ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొత్స నరసింగరావు మేడే జెండాను ఎగురవేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బెలగాం సెంటర్‌ నుండి నాలుగు రోడ్ల సెంటర్‌ వరకు బైక్‌ ర్యాలీ సాగింది. తరువాత నాలుగు రోడ్ల సెంటర్లో గల కళాసీ సంఘం జెండా దిమ్మ వద్ద మేడే జెండాను వర్తక కళాసీ సంఘం అధ్యక్షులు గేదెల సర్వేశ్వరరావు ఎగురవేశారు. అనంతరం 4 రోడ్ల జంక్షన్‌ నుండి మెయిన్‌ రోడ్డు, పాత బస్టాండ్‌ మీదుగా కళాసి సంఘం ఆఫీస్‌ వరకు మేడే ప్రదర్శన జరిగింది. కళాసీ సంఘం ఆఫీసు వద్ద మేడే జెండాను సంఘం కార్యదర్శి రాగోలు సర్వేశ్వరరావు ఎగురవేశారు.

పాచిపెంట : అంతర్జాతీయ కార్మికు దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌, జూనియర్‌ కాలేజీ ఆవరణలో జెండా ఆవిష్కరణ జరిగింది. జూనియర్‌ కాలేజీ ఆవరణలో శ్రామిక మహిళా నాయకులు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పాచిపెంట ప్రాజెక్ట్‌ కార్యదర్శి కె.పార్వతీదేవి జెండా ఆవిష్కరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌, గాంధీ బొమ్మ వద్ద జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఆటో కార్మిక సంఘంనేత చింత పోలిరాజు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, బోను గౌరు నాయుడు, గోలి రామారావు, పలువురు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

మక్కువ : మండల కేంద్రం రచ్చబండ వద్ద మే జెండాను సిఐటియు మండల కార్యదర్శి జి.కృష్ణ ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌ వై నాయుడు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి. ప్రభాకర, జి.దాలమ్మ, జి.పవన్‌కల్యాణ్‌, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం: మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మే డే దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐటియు నాయకులు ఎన్‌.ప్రసాదరావు, పి.ప్రసాదరావు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో చిన్నతల్లి, కాంచన రాజు తదితరులు పాల్గొన్నారు.

పాలకొండ : మండల కేంద్రంలో పలు గ్రామాల్లోనూ, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రైస్‌ మిల్లు జంక్షన్‌, గొట్టమంగళాపురం, తంపటాపల్లి, ఆర్‌టిసి కాంప్లెక్స్‌, ఆటో స్టాండ్‌ సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి పట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు బి.అమరవేణి, కాద రాము, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.హిమాప్రభ, జి.జెస్సీబాయి, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మజ్జి వీరంనాయుడు, అర్తమూడి లక్ష్మణరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు చింతల సురేష్‌, చింతల సంజీవి, పడాల వేణు, రైస్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గేదెలు సత్యం ఎడ్ల శ్రీనివాసరావు వివిధ ప్రజాసంఘాల నాయకులు టి శ్రీరాములు బాబాది శివ దూసి దుర్గారావు కార్తీక్‌ మనీ రఘు విమల శ్రీదేవి ఎస్‌ నారాయణరావు ఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట: మే డే సందర్భంగా స్థానిక సిఐటియు కార్యాలయంలో నాయకులు ఎం.కాంతారావు జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.భాస్కరరావు, ఎం.తిరుపతిరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా మార్చేసి పెట్టుబడి దారులకు తొత్తుగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, భాషవాలంటీర్లు పాల్గొన్నారు.

సాలూరు రూరల్‌ : మండలంలోని మామిడిపల్లి మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద శ్రీముంగారమ్మ తల్లి ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మేడే జెండాను యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎన్‌ వై నాయుడు ఆవిష్కరించారు. అనంతరం బాగువలస జంక్షన్‌ వద్ద జరిగిన జెండా ఆవిష్కరణను అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షులు గౌరీశ్వరి చేపట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మర్రిశ్రీనివాస్‌, ముంగారమ్మ తల్లి ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు జరజాపు జ్యోతీశ్వరరావు, బి.అప్పారావు, వై.అప్పలరాజు, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు అధ్యక్షులు శశికళ, గౌరవాధ్యక్షులు నారాయణమ్మ, నాయకులు మరియమ్మ, పుష్ప, కుమారి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, నాయకులు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

గరుగుబిల్లి : మేడే సందర్భంగా మండల కేంద్రంలో కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించి, కార్మిక వర్గ పోరాటాలలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లాకార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ కార్మికవర్గం చైతన్యంతో మతోన్మాద బిజెపిని నిలువరించేందుకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు కె.రవీంద్ర, దాసరి వెంకట నాయుడు, కె.జగ్గారావు, రామారావు, సూర్యనారాయణ, బాబురావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

కొమరాడ: మేడే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాకాడ ఇందిరా అన్నారు. మేడే సందర్భంగా కొమరాడ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, ప్రజాసంఘాల నాయకులు చిరికి అనురాధ, ఆర్‌.రాజేశ్వరి, కె.దుర్గ, యమక గౌరు నాయుడు, ఆర్‌.శివున్నాయుడు, రంగా, వెంకటేష్‌, పార్వతి, పలువురు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, సిహెచ్‌డబ్ల్యులు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు పాల్గొన్నారు.

దోపిడీ శక్తులపై ఐక్య పోరాటాలు చేయాలి : అజశర్మ

సాలూరు : దేశంలో దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు కార్మికులు సిధ్ధం కావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజశర్మ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా అజశర్మ మాట్లాడారు. మేడే జెండా ఆవిష్కరణ అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. అంతకుముందు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి 8 గంటల పనిదినాలు సాధించుకుంటే మోడీ ప్రభుత్వం దాన్ని 12 గంటల పని విధానాన్ని చట్టం చేసిందని చెప్పారు. పార్లమెంటులో ఈ చట్టానికి వైసిపి, టిడిపి మద్దతు తెలిపాయన్నారు. శ్రమ జీవుల హక్కుల పరిరక్షణకు పోరాడే పార్టీల అభ్యర్థులను చట్టసభలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, మాజీ నాయకులు కోటేశ్వరరావు, టి.రాముడు, వెంకటరావు, శ్రీను, పోలరాజు పాల్గొన్నారు.

➡️