ఆర్టీసీ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

Dec 12,2023 15:58 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని : ఆర్టీసీ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఎన్ఎంయుఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పివి రమణా రెడ్డి, వై.శ్రీనివాస రావు, రీజనల్ కార్యదర్శి మద్దిలేటి డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆదోని డిపో ఎదుట భోజ‌న విరామ స‌మ‌యంలో న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఈపీఎఫ్ 95, సిపిఎస్‌పై ఆప్షన్ నిలుపుదల చేసి ఉద్యోగి ఎప్పుడైనా ఆప్షన్‌ను ఇచ్చుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ నుంచి మినహాయింపు చేసి సంస్థలో ఇదివరకే ఉన్న పరిమితి లేని వైద్యాన్ని కొనసాగించాలన్నారు. దీర్ఘ‌కాలంగా పెండింగులో ఉన్న‌ ఆపిల్స్‌ను సానుకూలంగా పరిష్కరింపజేసి ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. మెడికల్ లీవ్‌లో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వేతనం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యారేజీలో ఖాళీలను ప్రమోషన్ల‌, రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్నారు. గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చిన మెమోరాండంలోని 59 సమస్యల పరిష్కారం ఆందోళ‌న‌లు చేప‌ట్టామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య సలహాదారుడు లక్ష్మన్న, డిపో కార్యదర్శి హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ బసవ రాజు, అధ్యక్షులు దాదా, గారేజ్ కార్యదర్శి షరీఫ్, ఎన్ఎంయుఏ సభ్యులు పాల్గొన్నారు

➡️