సార్వత్రిక పోరు ప్రశాంతం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతంగా ముగిసింది. కడప, రాజంపేట పార్లమెంట్‌ సహా 13 అసెంబ్లీ స్థానాల బరిలో 32 మంది పార్లమెంట్‌, 180 ఎమ్మెల్యే అభ్యర్థులు నిలిచారు. కడపలో 14 మంది ఎంపీ, 110 మంది ఎంఎల్‌ఎ, అన్నమయ్య జిల్లాలో 18 మంది పార్లమెంట్‌, 70 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కడప, అన్నమయ్య అధికార యంత్రాంగాలు 3,104 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కడప జిల్లాలో 2,035 పోలింగ్‌ కేంద్రాలను, అన్నమయ్య జిల్లాలో 1604 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల ఇవిఎంలు మొరాయించిన నేపథ్యంలో పలు పోలింగ్‌ కేంద్రాల్లో పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. పెరిగిన పోలింగ్‌ జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ జోరుగా నడిచింది. మధ్యాహ్నం భోజన విరామం మినహా పోలింగ్‌ ఊపందుకుంది. కడప జిల్లాలో పోలింగ్‌ ముగిసే సమయానికి 72.85 శాతం, అన్నమయ్య జిల్లాలో 67.72 శాతం పోలింగ్‌ నమోదైంది. కడప, అన్నమయ్య జిల్లాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటింగ్‌ పోలరైజేషన్‌ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఫలితంగానే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వేగం ఊపందుకుంది. తంబళ్లపల్లి, మదనపల్లి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలకు చెందిన కొన్ని పోలింగ్‌ కేం ద్రా ల్లో ఇవిఎంలు మొరాయించడంతో గంటపాటు ఆలస్యంగా పోలింగ్‌ ప్రార ంభమైంది. ఫలితంగా కాస్త పలు పోలింగ్‌ కేంద్రాల ముందు ఓటర్లు బారులు దీరడం కనిపించింది.వైసిపి శ్రేణుల బరితెగింపురైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు సమీపంలోని కొండూరు పోలింగ్‌ కేంద్రం వద్ద గుమికూడటాన్ని ప్రస్తావించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాలపై వైసిపి రాళ్ల దాడులకు పాల్పడింది. మాజీ ఎమ్మెల్సీ కారు అద్దాలను ధ్వంసం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం పుల్లూరులో ఘర్షణ, అధికార వైసిపి నాయకులు టిడిపి కార్య కర్త తలపగలగొట్టడంతో ఆస్పత్రి పాలయ్యారు. జాండ్లవరంలో టిడిపి కార్యకర్తలు వైసిపి ఏజెంట్లను బెదిరించడం, ఎస్పీ, పోలీసుల జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. చాపాడు మండలం చిన్నగురవలూరులో టిడిపి ఏజెంట్లపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం పి.బొమ్మేపల్లి, పొన్నతోట, పెద్దముడియం మండలం చిదిపిరాళ్లదిన్నె స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నాయి. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం మబ్బుచింతల పల్లిలో వైసిపి, టిటిపి కార్యకర్తలు పరస్పరం రాళ్లు దువ్వుకున్న ఘటన చోటుచేసుకుంది.దాడులు, దౌర్జన్యాలు రైల్వేకోడూరు నియోజకవర్గం కొండూరు పోలింగ్‌బూత్‌లో మాజీ ఎమ్మెల్సీ బత్యాలపై రాళ్లదాడి, కారు అద్ధాలు ధ్వంసం చేశారు. పోలింగ్‌ బూత్‌ ఆవరణంతోపాటు రహదారిలో పెద్ద ఎత్తున గుమిగూడి ఉండడాన్ని ప్రశ్నించడంతో ఘటన చోటుచేసుకుంది. కొండూరు బూత్‌పై వైసిపి ఆధి పత్యం కొనసాగినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రవేశం చేయడంతో అక్కడి నుంచి ఎమ్మెల్సీ బత్యాలను పంపించేశారు. పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లి, దళవాయిపల్లిల్లో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని ఎస్‌ఎన్‌కాలనీ పోలింగ్‌ బూత్‌లో ఉద్రిక్తత నెలకొంది. వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో సద్దు మణిగింది. లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. నక్కలపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి చేసిన కర్రలదాడిలో వైసిపి కార్య కర్తలకు గాయాలు కావ డం గమనార్హం. మదనపల్లి పోలింగ్‌ కేంద్రం 36 నెంబర్‌లో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట, మదనపల్లి పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో వైసిపి కార్యకర్తల దాడి, పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో సద్దుమణిగింది. మదనపల్లి రవీంధ్రనాథ్‌ఠాగూర్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో టిడిపి, వైసిపి నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పీలేరు పరిధిలోని కలకడ పోలింగ్‌ బూత్‌లో ఓ ఎంపిపి హల్‌చల్‌ నేపథ్యం ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. రాజంపేట పరిధిలోని సీతారామపురం, కొండ్లోపల్లి, చమనవారిపల్లిలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వివాదం. ఇవిఎంల మొరాయింపు జిల్లాలో పలుచోట్ల ఇవిఎంలు మొరాయించాయి. రైల్వేకోడూరు పరిధిలోని పుల్లంపేట మండలం దళవాయిపల్లిలో ఇవిఎంలను కొందరు పగులకొట్టడం కలకలం రేపింది. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట, మదనపల్లి రాయలసీమ స్కూల్‌, మదనపల్లి, కడప జిల్లాలోని మైలవరం మండలంనార్జంపల్లి, పొన్నతోట, ప్రొద్దుటూరు పరిధిలోని అమృత నగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఇవిఎంల మొరాయింపు గంటపాటు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం.

➡️