అవినీతి పాలనకు అంతిమ గడియలు:’నల్లారి’

ప్రజాశక్తి-కలకడ అవినీతి పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని పీలేరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బాలయ్యగారిపల్లి పంచాయతీ ఎర్రయ్యగారిపల్లి తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి కొద్దిరోజుల్లో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అరాచకాలు, అవి నీతిపనులు, దుర్మార్గపుచర్యలు, ప్రజలు చూస్తున్నారని వాటిని తిప్పి కొట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నట్లు విమర్శించారు.బస్సు యాత్రలు, సమావేశాలకు ఆర్‌టిసి బస్సులను వాడుకోవడం ప్రజలకు, ప్రయాణికులకు పలు రకాలుగా ఇబ్బందులు పెట్టడం గమనించి వచ్చేఎన్నికలలో జగన్‌ను ఇంటిదారి పట్టించడం ఖాయమని పలికారు. నిత్యవసర వస్తువుల సరుకుల ధరలు పెంచి ప్రజలను మభ్యపెట్టి నవరత్నాల పథకాలతో ప్రజలను మోసం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దిపట్ల సూర్యప్రకాష్‌ నాయు డు, మల్లారపు రవి ప్రకాష్‌ నాయుడు, మాజీ జడ్‌పిటిసి తిరుపతి నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, దగ్గుపాటి వెంకటే శ్వరరావు, సర్పంచ్‌లు విశ్వనాథనాయుడు, వెంకటరమణ, మాజీ సర్పంచ్‌ త్యాగరాజు, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

➡️