ఫోటో జర్నలిస్టు కృష్ణ పై దాడిచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : ఏపియుడబ్యూజె

Feb 19,2024 13:54 #APUDJ, #attack, #photo journalist

రాయదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టు కృష్ణ పై విచక్షణారహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఏపియుడబ్యూజె రాయదుర్గం శాఖ అధ్యక్షులు కమలాక్షుడు డిమాండ్‌ చేశారు. కృష్ణపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. సిపిఐ, సిపిఎం, జనసేన, ఎంఆర్‌పిఎస్‌, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, రైతుసంఘం, తదితర ప్రజాసంఘాల నాయకులతో కలిసి సోమవారం రాయదుర్గం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ చిట్టిబాబుకు, అనంతరం పోలీసు స్టేషన్‌ వద్దకు ర్యాలీగా వెళ్లి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపియుడబ్యూజె రాయదుర్గం శాఖ అధ్యక్షులు కమలాక్షుడు, ప్రధాన కార్యదర్శి గురురాఘవేంద్ర కోరారు. సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, సిపిఎం జిల్లా కమిటి సభ్యులు మల్లికార్జున, జనసేన నియోజకవర్గ ఇంచార్జి మంజునాథ గౌడ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కొట్రేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగిశివ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు హరగోపాల్‌, తదితరులు కృష్ణపై జరిగిన పాశవిక దాడిని ఖండించారు. జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్యూజె ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఖాజాహుసేన్‌, ఉపాధ్యక్షులు రఘు, ప్రచార కార్యదర్శి ఆవుల మనోహర్‌, పాత్రికేయులు రుద్రమునీ, రామాంజనేయులు, బాష, రాము, భక్త, ఎర్రిస్వామి, లోకానాథ్‌, నాగభూషణ, ఈరన్న, సవారప్ప, ప్రకాష్‌, విరుపాక్షి, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

➡️