అరణియార్‌ గేట్లు ఎత్తివేత

అరణియార్‌ గేట్లు ఎత్తివేత

అరణియార్‌ గేట్లు ఎత్తివేతపజాశక్తి – పిచ్చాటూరు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అరణియార్‌ ప్రాజెక్టులో మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు ఈఈ మదన్‌ గోపాల్‌ రాజు ఆధ్వర్యంలో సోమవారము సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేత నాలుగు గేట్లను రెండు అడుగుల నీటిమట్టాన్ని కింద భాగమునకు విడుదల చేశారు. మండల అధ్యక్షులు చలపతిరాజు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గేట్లు ఎదురుగా ఉన్న పిచ్చాటూరు – శ్రీకాళహస్తి కాజ్‌వే పై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్రమత్తమైన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కాజ్‌వేకు రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి నదిని దాటకుండా రాకపోకలను నిలిపివేశారు.

➡️