ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ

ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ

ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ ప్రజాశక్తి- తిరుపతి సిటీ సార్వత్రిక ఎన్నికలు-2024 సమీపిస్తున్న నేపథ్యంలో విధుల నిమిత్తం తిరుపతి జిల్లాకు కేంద్ర పారా మిలటరీ సాయుధ బలగాలు (సిఆర్‌పిఎఫ్‌, సిఐఎస్‌ఎఫ్‌) రానున్నాయి. వారు స్థానికంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న వసతి సముదాయాల వద్ద జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ మంగళవారం స్వయంగా తనిఖీ చేసి, పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికల విధుల నిర్వహణలో కేంద్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీసులు సమిష్టిగా కలిసి పని చేసి ప్రశాంతంగా ఎన్నికల ముగింపుకు కషి చేస్తుందన్నారు. కేంద్ర సాయుధ బలగాలు ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు స్థానికంగా ఉంటారని, అందుకు అనువైన భద్రత ఉన్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆ వసతి సముదాయాల వద్ద మౌలిక వసతులు అయిన నీరు, తాగునీరు, ఆహార పదార్థాలు, విద్యుత్తు సరఫరా, వారికి అవసరమైన రవాణా సదుపాయాలను నిరంతరం కల్పించాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదేనని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాయుధ దళం డిఎస్పి ఉన్‌ రవీంద్రారెడ్డి, ఎస్వీయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మురళీమోహన్‌ రావు పాల్గొన్నారు.

➡️